ఏపిలో మూతపడనున్న రెండు పార్టీలు!

Manikyala Rao
Manikyala Rao

విశాఖ: ఏపిలో రెండు పార్టీలు ఖచ్చితంగా త్వరలోనే మూతపడనున్నాయని బిజెపి నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపిలోకి ఎవరెవరు వస్తున్నారో ఇప్పుడే చెబితే ఎలా.. సస్పెన్స్ ఉండదన్నారు. రాజకీయ పార్టీలకు మిత్రపక్షంశత్రుపక్షం అంటూ ఉండవని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎప్పుడూ ప్రజాపక్షమేనన్నారు. అసెంబ్లీలో సభ్యుల వ్యవహార శైలిలో అప్పుడు.. ఇప్పుడు మార్పు కనిపించట్లేదన్నారు. అప్పుడు వ్యక్తిగత దూషణలతో సభ నడిస్తే.. ఇప్పుడు కూడా అదే పద్ధతిలోనే నడుస్తుందని వివరించారు. సభ్యులు అసెంబ్లీలో పరుషమైన భాషను వాడటం మంచిది కాదని హితవు పలికారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో జగన్ ముందుకు వెళ్తున్నట్టు భావన కనబడుతోందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. అందులో ప్రయోజనాలన్నీ వస్తున్నాయని వెల్లడించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: