నవాజ్‌ షరీఫ్‌పై మరో రెండు అవినీతి కేసులు దాఖలు

అమోదం తెలిపిన పాక్‌ అవినీతి శాఖ

Nawaz-Sharif
Nawaz-Sharif

లాహోర్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పై మరో రెండు అవినీతి కేసులు దాఖలు చేసేందుకు పాక్‌ అవినీతి శాఖ ఆమోదం తెలిపింది. నేషనల్‌ అకౌంట్‌బులిటీ బ్యూరో ( ఎన్‌ఎబి) ప్రాంతీయ డైరెక్టర్‌ జనరల్‌ సాజాద్‌ సలీమ్‌ శుక్రారం ఇక్కడ సమావేశమయ్యారు. నవాజ్‌ షరీఫ్‌, ఆయన సోదరుడు షాబాజ్‌షరీఫ్‌, కుమార్తె మరియం నవాజ్‌లతో పాటు మరో 13 మందిపై మనీలాండరింగ్‌ , ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపై చర్చించింది. అలాగే 54 కెనాల్‌ భూవివాద కేసులోనూ నవాజ్‌ పేరును మార్చాలని బోర్డు నిర్నయించింది. ఇందులో జియో మీడియా గ్రూప్‌ వ్యవస్థాపకుడు మీర్‌ షకీలూర్‌ రెహ్మాన్‌తో పాటు మరో ఇద్దరిని చేర్చాలని ఎన్‌ఎబి నిర్ణయించింది. ఈ రెండు కేసులను కోర్టులో ప్రవేశపెట్టే ముందు ఎన్‌ఎబి బోర్డ్‌ చైర్మన్‌ జస్టిస్‌ జావేద్‌ ఇక్బాల్‌ దృష్టికి తీసుకెళ్లింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/