ఈఎస్‌ఐ స్కాంలో మరో ఇద్దరి అరెస్ట్‌

ESI Scam
ESI Scam

హైదరాబాద్‌: గతంలో ఈఎస్‌ఐ కుంభకోణం సంచలనం సృష్టించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన డైరక్టర్‌ దేవికారాణిని ఏసిబి అధికారులు గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఏసిబి అధికారులు ఈ కేసులో విచారణను ముమ్మరం చేశారు. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని ఏసిబి అధికారులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌లో గల విశాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కు చెందిన పందిరి భూపాల్‌ రెడ్డి, వసుధ మార్కెటింగ్‌ ఏజెన్సీకి చెందిన నాగేందర్‌ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. గతంలో డైరక్టర్‌ దేవికారాణి, తేజా ఫార్మా కంపెనీ వర్గాలు, ఫార్మసిస్ట్‌ నాగలక్ష్మిలతో వీరిద్దరూ కుమ్మక్కైన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి ఐఎంఎస్‌ సంస్థ నుంచి నకిలీ బిల్లులను పొందినట్లు ఏసిబి అధికారులు తెలుసుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/