రెండు మిలియన్‌ డాలర్లను చెల్లించాల్సిందే..

ట్రంప్‌కు కోర్టు ఆదేశం

Trump
Trump

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విరాళాలను దుర్వినియోగం చేశారని న్యూయార్క్‌ కోర్టు ఆయనకు రెండు మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ట్రంప్‌ ఆధ్వర్యంలో నడుస్తోన్న ‘ట్రంప్‌ ఫౌండేషన్‌కు వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారనే అభియోగం ఆయనపై ఉంది. దీనిపై న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ జేమ్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిధుల్ని వాడుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ సాలియన్‌ స్కార్పుల్లా మొత్తం ఎనిమిది స్వచ్ఛంద సంస్థలకు ట్రంప్‌, ఆయన కుటుంబ సభ్యులు రెండు మిలియన్‌ డాలర్లు చెల్లించాలని న్యూయార్క్‌ కోర్టు ఆదేశించింది. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ ‘ట్రంప్‌ ఫౌండేషన్‌ చేసిన కొన్ని చిన్న సాంకేతిక ఉల్లంఘనల నేపధ్యంలో కోర్టుతో ఓ ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ ఒప్పందాన్ని అటార్నీ జనరల్‌ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అయితే రెండు మిలియన్‌ డాలర్లను కోర్టు ఆదేశం ప్రకారం చెల్లించడం ఆనందంగా ఉందన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/