ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

వఘామా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున ఎన్‌కౌంటర్

Jammu and Kashmir encounter

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా, వఘామా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వఘామా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న జమ్మూకశ్మీర్‌కు చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవాన్లు ఈ ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా దళాల రాకను గమనించిన ఉగ్రవాదులు వెంటనే వారిపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టినా మ‌రికొంద‌రు ఉగ్ర‌వాదులు అదే ప్రాంతంలో దాగి ఉన్నార‌న్న స‌మాచారం మేర‌కు సెర్చింగ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ద‌ని ఆర్మీ అధికారులు తెలిపారు.   


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/