గోవా డిప్యూటి సియంను తొలగించిన సియం

pramod sawant
pramod sawant, goa cm


పనాజీ: గోవా ఉప ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించారు. బిజెపి నేతృత్వంలో భాగస్వామిగా ఉన్న మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ(ఎమ్‌జిపి)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరుతున్నట్లు బుధవారం ప్రకటించారు. దీంతో అక్కడ బిజెపి బలం 14కి చేరింది. ఎమ్‌జీపికి చెందిన మనోహర్‌ అజ్‌గావ్‌కర్‌, దీపక్‌ పుష్కర్‌లు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. దీంతో వారి విజ్ఞప్తిని స్పీకర్‌ అంగీకరించడంతో పాటు తదుపరి కార్యాచరణను మొదలుపెట్టాలని శాసనసభ వ్యవహారాల కార్యదర్శిని ఆదేశించారు. ఇది పార్టీ ఫిరాయింపుల పరిధిలోకి రాదని బిజెపిలో చేరిన ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.
ఐతే మరో ఎమ్‌జిపి నేత, ఉప ముఖ్యమంత్రి సుధిన్‌ ధావలికర్‌ మాత్రం ఎమ్‌జిపిలోనే కొనసాగుతున్నారు. దీంతో ఆయన్ని కేబినెట్‌ నుంచి తొలగిస్తున్నట్లు సియం ప్రమోద్‌ బుధవారం ప్రకటించారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: