ఒంగోలు బైపాస్ రోడ్డులో ప్రమాదం: ఇద్దరు మృతి

పెళ్లిబృందం వ్యాన్ ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం

Road Accident
Road Accident

Ongole: ఒంగోలు బైపాస్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. గుర్తు తెలియని వాహనాన్ని పెళ్లి బృందం వ్యాను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు వ్యానులో చిక్కుకుపోయారు.

కట్టర్ల సహాయంతో వారిని బయటికి తీశారు. ప్రమాదంలో పెళ్లికొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

తిరుపతిలో పెళ్లి వేడుక ముగించుకొని తెనాలికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/