జైషే ఉగ్రవాదులు ఇద్దరు హతం

encounter


న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన భారత్‌ నిన్న పాక్‌లో బాంబులతో విరుచుపడ్డారు. నేడు దేశంలోని ఉగ్రవాదుల ఏరివేతను చేపట్టింది. జమ్మూలోని షోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌ జరిపి జైషే మహ్మద్‌ ముఠాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. షోపియాన్‌లోని మీమెందర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమచారం. దీంతో భద్రతా బలగాలు ఈ ఉదయం తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు వారిపై కాల్పులు జరిపాయి. దీంతో ఎదురుకాల్పులు జరిపిన సిబ్బంది ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ప్రస్తుతం ఇంకా ఎన్‌కౌంటర్‌ కొనసాగుతుంది. సొమవారం జరిగిన మెరుపుదాడులలో దాదాపు జైషేకు చెందిన 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.