అమెరికా కోర్టుకు భారత సంతతి మహిళలు

indian-origin women judges
indian-origin women judges

న్యూయార్క్‌: ఇద్దరు భారత సంతతి మహిళలు అమెరికాలో న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. న్యూయార్క్‌లోని క్రిమినల్‌ కోర్టు జడ్జిగా అర్చనా రావు, సివిల్‌ కోర్టు న్యాయమూర్తిగా దీపా అంబేకర్‌ (43)లను నగర మేయర్‌ బిల్‌ డీ బ్లాసియా నియమించారు. అర్చనారావు తొలుత సివిల్‌ కోర్టు తాత్కాలిక జడ్జిగా గత జనవరిలో నియమితులైన సేవలందించారు. దీపా అంబేకర్‌ 2018 మే నెలలో సివిల్‌కోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/