స్వదేశానికి చేరుకున్న భారతీయులు

రెండు విమానాల ద్వారా 363 మంది భారతీయులు

First two flights land in Kerala

కొచ్చి: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అబుదాబి నుండి గల్ఫ్ సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. తొలి విమానం అబుదాబి నుండి బయలుదేరి కొచ్చికి వచ్చింది. దుబాయ్ నుండి రెండో విమానం కూడా కరుప్పూర్ (కన్నూర్)కు చేరింది. ఈ రెండు విమానాల ద్వారా 363 మంది ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే, వీరిలో ఎవ్వరికీ కరోనా లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు. ఈ రెండు విమానాలలో 49 మంది గర్భిణీ భారతీయ మహిళలు ఉండడం విశేషం. కాగా, విమానంలో స్వదేశానికి వచ్చిన ప్రయాణికులకు రెండు మాస్కులు, శానిటైజర్, రెండు శాండ్‌విచ్‌లు, ఫ్రూట్ కేక్, నీళ్ల బాటిల్ అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందర్నీ ఏడు రోజుల పాటు క్వారంటైన్ చేయనున్నట్లు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/