మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం

ఓ పార్టీలో తుపాకీ కాల్పులు..ఇద్దరి మృతి, 13 మందికి గాయాలు

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. చికాగోలో ఓ పార్టీ జరుగుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. సంఘటన స్థలం నుంచి చికాగో పోలీసులు నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది గ్యాంగ్ వార్ అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చికాగో కూడా ఒకటి. ఇక్కడ 2020లో తుపాకీ కాల్పుల కారణంగా 760 మందికి పైగా మరణించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/