మోడీ కిరీటంలో రెండు కలికితురాయిలు!

వార్తల్లోని వ్యక్తి (ప్రతి సోమవారం)

PM MODI
PM MODI

ప్రధాని నరేంద్రమోడీ అదృష్టవంతుడా? లేక, సాహసికుడా? లేదా, తనకు ముందువచ్చిన 14 మంది ప్రధానుల కంటె- నెహ్రూ, గుల్జారీలాల్‌నందా, లాల్‌బహదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీదేశా§్‌ు, చరణ్‌సింగ్‌, రాజీవ్‌గాంధీ, వి.పి.సింగ్‌, చంద్రశేఖర్‌, పి.వి.నరసింహారావ్ఞ, వాజ్‌పేయి, దేవెగౌడ, ఐ.కె గుజ్రాల్‌, మన్మోహన్‌సింగ్‌ల కంటె మొనగాడా? (వీరిలో నందా, ఇందిరా, వాజ్‌పేయి రెండుసార్లు వేర్వేరు కాలాలలో ప్రధాని పదవి నిర్వహించారు)
వారందరికంటె మోడీ మొనగాడని అనలేము కాని, వారందరి కంటె సాహసికుడు, లేదా చాణక్యుడని చెప్పవచ్చునేమో!
ఎందువల్లనంటే, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పట్టిపీడిస్తున్న కాశ్మీర్‌ సమస్యను ఆయన ఇట్టే పరిష్కరించారు. కాశ్మీర్‌ వ్యాధికి మూలకారణం రాజ్యాంగంలోని 370వ సూత్రమేనని ఆయన గుర్తించారు. ఆ ఆర్టికల్‌ వల్లనే కాశ్మీర్‌పై కేంద్రానికి తక్కిన 28 రాష్ట్రాలపై వలె ఆధిపత్యం చెలాయించడానికి వీలులేకపోతున్నదని ఆయన – హోమ్‌ మంత్రి అమిత్‌షా గ్రహించారు. కాశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు సిద్ధించినా, అది రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నదని ఆ ద్వయం భావించారు. ఆ ప్రత్యేక ఆర్టికల్‌ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి దోహదమిస్తున్నదని కూడా వారు గ్రహించారు.తత్ఫలితంగా ఆ 370వ ఆర్టికల్‌నే ఒక్కదెబ్బతో రద్దు చేయగా,దానితో వచ్చిన కాశ్మీర్‌ ప్రత్యేకప్రతిపత్తి కూడా రద్దయింది.
అంతేకాదు- కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి రద్దుకావడంతో దాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను చేశారు- జమ్మూ-కాశ్మీర్‌, లడఖ్‌. ఇక, ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌ వత్తాసుకు అక్కడ అవకాశాలు క్షీణించాయి. ఒకవేళ అవి తలయేత్తితే, వాటిని ఉక్కుపాదంతో అణచివేయడానికి కేంద్రానికి సంపూర్ణ అధికారాలు వ్ఞండనే ఉన్నాయి.
అంతేకాదు- 1947 అక్టోబర్‌లో కాశ్మీర్‌ నుంచి పాకిస్థాన్‌ దురాక్రమించిన నాలుగు జిల్లాలు- పూంఛ్‌, గిల్గిత్‌, విూర్‌పూర్‌, ముజఫరాబాద్‌లు-కాశ్మీర్‌లో అభిన్నభాగాలని కూడా కేంద్రం ప్రకటించింది.
అందువల్ల ‘మంచిరోజు చూసి కేంద్రం ఆ నాలుగు జిల్లాలను కూడా పునరాక్రమించవచ్చు.
బాబ్రీ మసీదుపై అద్భుతమై తీర్పు
కాశ్మీర్‌ సమస్య దశాబ్దాలుగా నడుస్తూవ్ఞంటే, బాబ్రీ మసీదు సమస్య శతాబ్దాలుగా పీడిస్తున్నది. ఇది భారత్‌లో రెండు ప్రధాన మతాల మధ్య కలతలకు, వాదప్రతివాదాలకు, ఉద్రిక్తపరిస్థితులకు కారణమవ్ఞతూ వచ్చింది.
ఈ సమస్యపై మొన్నటి సుప్రీం తీర్పుకు, ప్రధానికి ఏవిూ సంబంధం లేకపోయినా, మరి లోగడ 14 మంది ప్రధానుల హయాంలోనూ పరిష్కారం కాని ఈ సమస్య మోడీ హయాంలోనే పరిష్కారం కావడం ఆశ్చర్యంగా లేదా?
నెహ్రూ-పటేల్‌, మోడీ-అమిత్‌షా
కాగా, ఇక్కడొక ఆసక్తికరమైన విషయాన్ని పేర్కొనాలి. ప్రధాని నెహ్రూ హయాంలో ఆయన హోమ్‌మంత్రి సర్దార్‌వల్ల భా§్‌ుపటేల్‌. నెహ్రూకు పటేల్‌కు చాలా సమస్యలపై అభిప్రాయభేదాలుండేవి. ముఖ్యంగా కాశ్మీర్‌ సమస్యపై. అలాగే, హైదరాబాద్‌ సమస్య కూడా. కాశ్మీర్‌ సమస్యను నెహ్రూ ఐక్యరాజ్యసమితికి తీసుకువెళ్లడం పటేల్‌కు ఇష్టంలేదు. అలాగే హైదరాబాద్‌పై పటేల్‌ ‘పోలీసు చర్య తీసుకోవడం నెహ్రూకు ఇష్టం లేదు. నెహ్రూ ఎక్కువగా ఆదర్శవాదేకాని ఆచరణవాది కాదు. పటేల్‌ కార్యదక్షుడు కాని, భావ్ఞకుడు కాదు. అందువల్లనే, వారిద్దరికి మధ్య ఏకాభిప్రాయాలకంటె అభిప్రాయభేదాలే హెచ్చు. అందువల్ల, దేశం కొంతనష్టపడిందనే చెప్పాలి.
ఇక, ప్రధాని మోడీ రెండవ ప్రభుత్వంలో అమిత్‌షా హోమ్‌మంత్రి. నిజానికి, ఆయన మొదటి ప్రభుత్వంలోనే అమిత్‌షాను హోమ్‌మంత్రిగా తీసుకుని వ్ఞండవలసింది. మరి, ఇద్దరిదీ ఒకేమాట, ఒకే బాట. ఉదయం, సాయంత్రం ఇద్దరూ దేశసమస్యపై పరస్పరం సంప్రదించుకుంటూ వ్ఞంటారు. ఆయన అభిప్రాయాన్ని ఈయన కాదనరు. ఈయన అభిప్రాయాన్ని ఆయన కాదనరు.
అది కాశ్మీర్‌ సమస్య కానివ్వండి, బాబ్రీ సమస్య కానివ్వండి. ఇద్దరిదీ ఒకే మాట! అదే మోడీ విజయానికి రాచబాట!

-డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు,(”పద్మశ్రీ అవార్డు గ్రహీత)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/