ట్రంప్‌ హెచ్చరికపై స్పందించిన ట్విట్టర్‌ సీఈవో

మా ఉద్యోగులను వదిలేయండి.. బాధ్యత నాదే..ట్విట్టర్‌ సీఈవో

donald trump
donald trump

అమెరికా: ఎన్నికల్లో మెయిల్ బ్యాలెట్ల‌తో ఫ్రాడ్ జ‌రుగుతుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల చేసిన ట్వీట్లు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ ఆయనకు తొలిసారి ట్విట్ట‌ర్ ‘ఫ్యాక్ట్‌ చెక్’‌ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాను చేసిన రెండు ట్వీట్లకు ట్విట్టర్‌ వార్నింగ్ లేబుల్ ఇవ్వడంతో ట్రంప్ మండిపడి రిటర్న్‌ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) జాక్‌ డోర్సీ వివరణ ఇచ్చి తమ సంస్థ చేసిన పనిని సమర్థించుకున్నారు. ‘మా సంస్థ తీసుకుంటున్న చర్యలకు ఒకరు తప్పకుండా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ బాధ్యత వహించాల్సిన వ్యక్తిని నేనే. ఈ వివాదంలోంచి మా ఉద్యోగులను వదిలేయండి. ప్రపంచ వ్యాప్తంగా దేశాల్లో జరిగే ఎన్నికలపై వచ్చే తప్పుడు ప్రచారాన్ని, వివాదాస్పద పోస్టులను మేము తప్పకుండా గుర్తిస్తాం. ఒకవేళ మేము ఏదైనా తప్పు చేస్తే వెంటనే అంగీకరిస్తాం’ అని ఆయన తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/