ప్రముఖ టీవీ నటి ఆత్మహత్యాయత్నం..నిమ్స్ కు తరలింపు

ఈ మధ్య చిత్రసీమ లో ఆత్మ హత్యలు ఎక్కువై పోతున్నాయి. కొంతమంది ఛాన్సులు రాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే..మరికొంతమంది ఇంట్లో గొడవల కారణాలతో ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. తాజాగా ఈరోజు సోమవారం ప్రముఖ టీవీ నటి మైథిలి ఆత్మహత్యాయత్నం చేసింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సోమవారం సాయంత్రం ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫోన్‌ చేసి తన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాదు తన భర్త బండి సీజ్‌ చేయాలని లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని మైథిలి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అప్పటికే మైథిలి 8 బ్రీజర్లు, స్లీపింగ్‌ ట్యాబ్లెటను మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇక ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు ఆమె ఇంటికి చేరుకునే సరికి అపస్మారక స్థితిలో ఉన్న మైథిలిని సమీపంలోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతున్నట్లు సమాచారం.