బుల్లితెర నటి వైశాలి ఆత్మహత్య..

TV actor Vaishali Takkar dies by suicide

బుల్లితెర నటి వైశాలి ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ సాయిబాగ్‌లోని తన ఇంట్లో ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకొని విచారం చేస్తున్నారు. వైశాలి ప్రసిద్ధ టీవీ సీరియల్ “ఏ రిష్తా క్యా కేహలాత హై” లో పని చేశారు. హిందీ బిగ్ బాస్ లో సైతం ఆమె పాల్గొంది.

సూపర్ సిస్టర్స్, మన్మోహిని 2 వంటి సీరియల్స్ ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వైశాలి.. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకునేది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి వైశాలి మంచి స్నేహితురాలు. వైశాలి ఆత్మహత్యతో టీవీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది.