టర్కీలో మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తల ఆందోళన

పార్లమెంట్‌లో ‘మ్యారి యువర్‌ రేపిస్ట్‌’ బిల్లు ప్రవేశపెట్టనున్న టర్కీ

Turkey
Turkey

అంకారా : సమాజంలో మహిళలకు భద్రత పెంచాలనీ, రోజులు మంచిగా లేవంటూ తల్లిదండ్రులు, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా టర్కీలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. లైంగికదాడికి పాల్పడిన దోషులను శిక్షల నుంచి రక్షించేందుకు సహకరించేలా ‘మ్యారి యువర్‌ రేపిస్ట్‌’ అనే కొత్త చట్టాన్ని అక్కడి ప్రభుత్వం తీసుకురానుంది. ఈ మేరకు జనవరి నెలాఖరులోగా టర్కీ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఆడ, మగ సమానం అనేది ప్రకృతి విరుద్దమంటూ టర్కీ అధ్యక్షుడు రెసిప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ పలుమార్లు వ్యాఖ్యానించారు. మ్యారి యువర్‌ రేపిస్ట్‌ బిల్లు ఆమోదం పొందితే.. దీని ప్రకారం 18ఏళ్ల లోపు యువకులు యువతులపై లైంగిక దాడులకు పాల్పడితే ఆ బాధితురాలిని పెండ్లి చేసుకోవాలి. దీంతో నిందితులకు ఎలాంటి శిక్ష విధించరు. అయితే త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా నిరసన మొదలైంది. ఈ బిల్లు మహిళల హక్కులను కాలరాయడంతో పాటు లైంగికదాడులకు ప్రోత్సహించడమే అవుతుందంటూ మహిళా సంఘాలు, హక్కుల సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/