డొనాల్డ్‌ ట్రంప్‌కు టర్కీ మరోసారి షాక్‌

trump - erdogan
trump – erdogan

టర్కీ:సిరియా వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు టర్కీ మరోసారి షాక్‌ ఇచ్చింది. సిరియాలో సైనిక దాడులు ఆపాలంటూ ట్రంప్‌ రాసిన లేఖను టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ చెత్త బుట్టలో వేసినట్టు వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. సిరియాలో దాడులు చేస్తూ వేలాది మంది అమాయకుల మరణానికి కారణమవ్వొద్దంటూ ట్రంప్‌ లేఖలో సూచించారు. అంతేకాకుండా ఎర్డోగాన్‌ పై లేఖలో తీవ్ర పదజాలం వాడారు. సిరియాలో కుర్దులపై దాడులు ఆపకపోతే చరిత్రలో ఓ కఠినాత్ముడిలా మిగిలిపోతారు.. మూర్ఖుడిలా ప్రవర్తించొద్దంటూ ఎర్డొగాన్‌ను ఉద్దేశించి ట్రంప్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి తప్పును చరిత్ర క్షమించబోదన్నారు. టర్కీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన వాడిగా తనను మిగిలిపోనివ్వొద్దంటూ ట్రంప్‌ లేఖలో తెలిపారు. అయితే, ఆ దేశాధ్యక్షుడు ఈ స్థాయిలో లేఖ రాస్తారా అని ఆగ్రహించడంతో పాటు ట్రంప్‌ సూచనను ఎర్డొగాన్‌ తోసిపుచ్చారు. ఆ లేఖను బుట్టదాఖలు చేయడంతో ఆగకుండా అదేరోజు సిరియాలోని కుర్దుల ఆదీనంలో ఉన్న ఈశాన్య ప్రాంతాలపై సైన్యం దాడులకు ఆదేశించడం గమనార్హం.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/