నా దృష్టంతా అధ్యక్ష ఎన్నికలపైనే

యూఎస్‌ కాంగ్రెస్‌కు మళ్లీ ఎన్నికవ్వాలని కోరుకోను

Tulsi Gabbard
Tulsi Gabbard

వాషింగ్టన్‌: యూఎస్‌ కాంగ్రెస్‌కు తిరిగి ఎన్నికవ్వాలని కోరుకోవడం లేదని, ప్రస్తుతం తన దృష్టంతా 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికలపైనే ఉన్నట్టు యూఎస్‌ ప్రెసిడెంట్‌ రేసులో ఉన్న తులసి గబ్బర్డ్‌ వెల్లడించారు. న్యూ హ్యాంషైర్‌ డెమోక్రటిక్‌ పార్టీ స్టేట్‌ కన్వెన్షన్‌లో ఈమె మాట్లాడుతూ నేను 2020లో కాంగ్రెస్‌కు తిరిగి ఎన్నిక కావాలని కోరుకోను. అధ్యక్షురాలిగా నా అభ్యర్థిత్వానికి మీ మద్దతును కోరుతున్నాను అని స్థానికులనుద్ధేశించి ప్రసంగించారు. గబ్బార్డ్‌ ప్రస్తుతం యూఎస్‌ ఆర్మీ నేషనల్‌ గార్డ్‌లో మేజర్‌గా విధులు నిర్వహిస్తున్నది. అంతేకాకుండా యూఎస్‌ ప్రతినిధుల సభలో ఏడేండ్లు పనిచేశారు. కాగా, డోనాల్డ్‌ ట్రంప్‌ను ఢీకొట్టడానికి పార్టీ నామినేషన్‌ కోరుతూ 18 మంది డెమొక్రాట్లు వరుసలో ఉండగా వారిలో గబ్బార్డ్‌ ఒకరు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/