ఏపి సియం జగన్‌పై తులసిరెడ్డి విమర్శలు

tulasi reddy
tulasi reddy, congress senior leader

విజయవాడ: సియం జగన్‌పై కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపి ప్రయోజనాలను కేసిఆర్‌కు తాకట్టుపెట్టే హక్కు జగన్‌కు లేదన్నారు. కేసిఆర్‌ మాయలో పడి జగన్‌ ఏపికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడంలేదని విమర్శించారు. జగన్‌ను కేసిఆర్‌ పావుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరానికి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదులు ఏపికి జీవనాడులని వివరించారు. కేసిఆర్‌ను కృష్ణమ్మను బంధించారు. గోదావరిని బంధఙంచేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గోదావరిలో మిగులు, నికర జలాలు వాడుకునే అర్హత ఏపికి మాత్రమే ఉందని తెలిపారు. గోదావరి నీళ్లు దోచుకునేందుకే కేసిఆర్‌ పాలమూరు, డిండి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని వెల్లడించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/