వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్ లో ‘టక్ జగదీష్’ సందడి

నేచురల్ స్టార్ నాని – రీతూ వర్మ జంటగా నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘టక్ జగదీష్’. నాని 26వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. గత కొద్దీ రోజులుగా ఈ చిత్ర రిలీజ్ ఫై అనేక రకాల వార్తలు ప్రచారం సాగాయి. కొంతమంది థియేటర్స్ లలో రిలీజ్ అవుతుందని..మరికొంతమంది ఓటిటి రిలీజ్ కాబోతుందని ఇలా ఎవరికీ తోచినట్లు వారు మాట్లాడడం జరిగింది. చివరకు మాత్రం నిర్మాతలు ఓటిటికే మొగ్గు చూపించారు. సెప్టెంబ‌ర్ 10న వినాయ‌క చవితి సంద‌ర్భంగా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

పండ‌గ‌కి మన ఫ్యామిలీతో ట‌క్ జ‌గ‌దీష్ చూద్దాం అని నాని తన ట్విట్టర్ లో తెలిపారు. అక్కడితో ఆగకుండా ఓ చిన్న వీడియో పోస్ట్ చేసాడు నాని. అందులో భూదేవిపురం చిన్న కొడుకు, నాయుడు గారి అబ్బాయి ట‌క్ జ‌గ‌దీష్ చెబుతున్నాడు.. మొద‌లెట్టండి అనే డైలాగ్ తో వీడియో పోస్ట్ చేసి ఆకట్టుకున్నారు. ‘టక్ జగదీష్ చిత్రం ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ సినిమాను గత వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. అయితే, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్ ప‌రిస్థితులు కూడా పూర్తిగా కంట్రోల్‌లోకి రానుందన అమెజాన్ ప్రైమ్‌లోమూవీని విడుదల చేస్తున్నారు.

పండగ కి మన Family తో…
మీ#TuckJagadish pic.twitter.com/sVVjSCsJlB— Nani (@NameisNani) August 27, 2021