ట్యుబర్‌క్యూలస్‌ మెనింజైటిస్‌

Cough
Cough

దీన్నే టిబి మెనింజైటిస్‌, బ్రెయిన్‌ ట్యూబర్‌క్యూలోసిస్‌, మెదడు టి.బి, మెనింజీయల్‌ ట్యూబిర్‌క్యూలోసిస్‌, టిబిసెరిబ్రైటిస్‌, టి.బి మైలైటిస్‌, టిబిఎమ్‌ అని కూడా అంటారు.
టిబిచరిత్ర: 1768లో రాబర్ట్‌ వైట్‌ మొదటిసారిగా దీన్ని గుర్తించాడు. టిబితో మరణించేవారిలో ఇది 7వ స్థానంలో వుంది. 1997లో టిబి మైనింగ్‌టిస్‌ 5వ స్థానంలో వుంది. సామన్యంగా టిబి ఊపిరితిత్తుల్లో వస్తుంది. అలాకాకుండా ఇది శరీరంలోని ఏ భాగంలో నైనా, 5.2% వస్తుంది. దీన్నే ఎక్క్‌ట్రా పల్మోనరీ టిబి అని అంటారు. అభివృద్ధి చెందిన యూనైటెడ్‌ దేశాల్లో అరుదుగా వస్తుంది. అభివృద్ధి చెందే దేశాల్లో కేంద్ర నాడీ మండలానికి వచ్చే దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్‌లో టిబి మొదటిది. ప్రతి సంవత్సరం రెండు బిలియన్స్‌ మంది టిబితో బాధపడితే అందులో 10% మంది ట్యూబర్‌క్యూలస్‌ మైనింజైటిస్‌తో బాధపడుతుంటారు. మెనింజెస్‌, వెన్నెముక, కేంద్రనాడీ మండలానికి టిబి వల్ల వచ్చే వాపును ట్యూబర్‌క్యూలస్‌ మెనింగ్‌టిస్‌ అని అంటారు. కొందరిలో మెనింజైటిస్‌ లక్షణాలు కనపడేవరకు శరీరంలో మరొకచోట టిబి వున్నట్లు తెలియదు. దీనివల్ల మెదడు అడుగు భాగం, బ్రెయిన్‌ స్టెమ్‌, సబ్‌ఆర్కనాయిడ్‌ వెరియా, క్రేనియల్‌ నర్వ్‌ రూట్స్‌్‌ కూడా ఎఫెక్ట్‌ అవుతాయి.

ఇలా వ్యాప్తి చెందుతుంది:
టిబి అంటువ్యాది గాలి ద్వారా ఊపిరితిత్తుల్లో లింఫ్‌గ్లాండ్‌లో టిబిని కల్గిస్తుంది. దీన్నే ప్రైమరీ కాంప్లెక్స్‌ అంటారు. తర్వాత రక్తం ద్వారా ఎముకలు, కీళ్లు, జీర్ణకోశం, మెదడుకు చేరుతుంది. దీన్నే సెకండరీ టిబి అంటారు. మెదడులో టిబి చిన్నచిన్న ట్యూబర్‌క్యూల్స్‌ ట్యూబర్‌క్యూలోస్‌ టిబి అబ్సెన్‌ రూపంలో వుంటుంది. ఇవి పగిలి సబ్‌ఆర్కనాయిడ్‌ ఏరియాలోకి వ్యాపించినపుడు మెదడు, మెదడు పొరలు దెబ్బ తింటాయి. దీన్నే మెనింజియల్‌ ట్యూబర్‌క్యూలోసిస్‌ అని అంటారు.
రిస్క్‌ ఫ్యాక్టర్స్‌: పోషకాహారలోపం, ఆల్కహాలిజమ్‌, డయాబెటిస్‌, కేన్సర్‌, తలకు దెబ్బ తగిలిన, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా వున్న అనాధలు, కార్టికోస్టిరాయిడ్‌ థెరపి తీసుకునేవారిలో, ఎయిడ్స్‌ టిబి ఎండమిక్‌ ఏరియాలో వున్న వారికి ఎక్కువగా వస్తుంది.
పిల్లల్లో 5 సంవత్సరాల లోపు వారికి, యుక్తవయస్కుల్లో ఎక్కువగా వస్తుంది. 20 సంవత్సరాలు దాటితే స్త్రీ,పురుషులిద్దరిలో సమానంగా వుంటుంది. ఇంతవరకు పరిశీలించిన గణాంకాల ప్రకారం పురుషుల్లోనే ఎక్కువగా 2:1 నిష్పత్తిలో వస్తుందని చెప్పవచ్చు.
6-24 నెలల పిల్లల్లో కనుక వస్తే ఇది సీరియస్‌ ప్రాబ్లమ్‌ అని చెప్పవచ్చు.

వ్యాధి లక్షణాలు:
ఇవి నిదానంగా 3 దశలలలో కల్గుతాయి.
మొదటి దశ: ఇరిటబుల్‌ స్టేజ్‌: వ్యాధిలక్షణాలు కనపడడానికి 10-15 రోజుల ముందు నుంచి నలతగా ఉండడటం, ఆకలి తగ్గడం, నీరసం, నిద్ర పట్టకపోవడం, మలబద్దకం శరీరం వెచ్చగా లేదా 100 ఫారన్‌హీట్‌ జ్వరం వుండడం మగత గొంతు బొంగురుపోవడం, పిల్లలు డల్‌గా, ఇరిటబుల్‌ (చిరాకు), అస్థిమితంగా వుంటారు. ఆడుకునేందుకు ఇష్టపడరు. వాంతులు తలనొప్పి తలబద్దలైన ట్లుండడం, వెలుతురు చూడలేకపోవడం, శబ్దాల్ని భరించలేక పోవడం దేనిపై ఏకాగ్రత లేకపోవడం వంటివి వుంటాయి.

రెండవ దశ:
మెనింజైటిస్‌ స్టేజ్‌: జ్వరం 101-102 లేదా 39డిగ్రిస్‌ వుండి విడిచి విడిచి రావడం, పల్స్‌ నిదానంగా రెగ్యులర్‌గా కొట్టుకోవడం, బ్రీతింగ్‌ ఇరెగ్యులర్‌గా కొట్టుకోవడం, మగత, డెలీవరియం, సంధి ప్రేలాపనలు, మెడ బిగపట్టేయడం, కండరాల అదురు, పళ్లు నూరడం, ఫిట్స్‌్‌ ఒక చేయి లేదా కాలు లేదా ఒక పక్క చచ్చుగా లేదా పక్షవాతం రావడం, పిచ్చి చూపులు చూడడం తల, మెడ వెనక్కి వంచడం (ఆపిస్థోమస్‌) మలమూత్ర విసర్జనపై కంట్రోల్‌ లేవపోవడం వంటి లక్షణాలు ఒక వారం దాకా వుంటాయి.

మూడవదశ:-
కోమా స్టేజ్‌: స్ప్రూృహ తప్పడం, జ్వరం తీవ్రంగా కంటిన్యూగా ఉండడం, కనుపాపలు విప్పారి ఉండడం, మెల్ల, నిష్టాగోమస్‌, టోసిస్‌, ఆప్మాలోప్లీజియా వంటి దృష్టిలోపాలు, పల్స్‌ ఇరెగ్యులర్‌గా ఉండడం, శరీరం వణకడం, చైన్‌స్ట్రోక్‌ రెస్పి రేషన్‌ డీహైడ్రేషన్‌, బరువు తగ్గడం, కాళ్లు కదల్చలేకపోవడం, నిస్సత్తువ పాలు తాగలేకపోవడం, పుణికి భాగం ఉబ్బడం, గుండెవేగం ఎక్కువగా వుండడం వంటి లక్షణాలు ఒక వారందాకా వుంటాయి. వ్యాధి లక్షణాలు దాదాపు నాలుగు వారాలదాకా వుంటాయి.

వ్యాధి నిర్ధారణ:
లంబార్‌ పంక్చర్‌ చేయడం-సెరిబ్రోస్పైనల ద్రవంలో ప్రోటీన్‌ ఎక్కువగా ఉంది గ్లూకోజ్‌ తక్కుకగా ఉండడం ఆసిడ్‌ఫాస్ట్‌ బాసల్లే, లింఫోసైట్స్‌ ఎక్కువగా వుంటాయి.
ఎలీస్పాంట్‌ టెస్ట్‌, నాట్‌టెస్ట్‌, బ్లడ్‌కల్చర్‌, ఛాతీఎక్స్‌రే, ఎలీసా, సీరాలాజికల్‌ టెస్ట్‌ సిఎస్‌ఎఫ్‌ కల్చర్‌, సిటిస్కాన్‌, స్కిన్‌టెస్ట్‌, బ్రెయిన్‌ బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.
కాంప్లికేషన్స్‌: పాపిల్లెడిమా, మయలైటిస్‌, వాస్కులైటిస్‌, ఆప్టిక్‌ న్యూరైటిస్‌, కొరియో రెటినైటిస్‌, ఆప్త్మాలో ప్లీజియా, బ్రెయిన్‌ డామేజ్‌, హైడ్రోసెఫలస్‌, ఫిట్స్‌, సబ్‌డ్యురల్‌ ఎప్యూజిన్‌, స్ట్రోక్‌, మరణం మెదడులో ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఎలర్జిక్‌ ఎన్‌సెఫలోపరీ, హెమరేజిక్‌ ల్యూకో ఎన్‌సెఫలోపతీ, ఆప్టిక్‌ అట్రోపీ, స్పైనల్‌ బ్లాక్‌, బుద్దిమాంద్యం, కేంద్ర క్రేనియల్‌ నర్వ్‌ ప్రాబ్లమ్స్‌, బ్లాడర్‌, బివల్‌ వ్యాధులు,న్యూరైటిస్‌ వంటి అనేక కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి. 10-30శాతం మందిలో వివిధ కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి. వయస్సు, వ్యాధితీవ్రత, వ్యాధి లక్షణాలున్న స్టేట్‌, చికిత్స బట్టి కాంప్లికేషన్స్‌ ఉంటాయి. సరైన చికిత్స ఇవ్వకపోతే 4-8 వారాల్లో చనిపోతారు.

  • డాక్టర్‌. కె.ఉమాదేవి,
    తిరుపతి