టీఆర్ఎస్‌ పార్టీలోకి ఎల్ ర‌మ‌ణ‌!

నేడు కేసీఆర్‌తో భేటీ అనంత‌రం మీడియా సమావేశం

హైదరాబాద్: టీడీపీ తెలంగాణ‌ అధ్యక్షుడు ఎల్.రమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. కాసేప‌ట్లో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో గులాబీ బాస్‌, తెలంగాణ‌ సీఎం కేసీఆర్ వ‌ద్ద‌కు ఆయ‌న రానున్నారు. ఇప్ప‌టికే ఎల్.ర‌మ‌ణ్ త‌న‌ కార్యకర్తలు, అభిమానులతో పార్టీ మారే విష‌యంపై చ‌ర్చించారు. కేసీఆర్‌తో భేటీ అనంత‌రం మీడియా సమావేశం నిర్వ‌హించి ఎల్.రమణ దీనిపై వివరాలు తెల‌ప‌నున్న‌ట్లు తెలుస్తోంది.

టీడీపీకి రాజీనామా చేసి, ఆయ‌న టీఆర్ఎస్‌లో చేర‌డం దాదాపు ఖ‌రార‌యిన‌ట్లేన‌ని స‌మాచారం. ఆయ‌న పార్టీ మార‌నున్న‌ట్లు గత కొన్ని నెలలుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఎల్‌.ర‌మ‌ణ‌తో ఇప్ప‌టికే టీఆర్ఎస్ చ‌ర్చ‌లు జ‌రిపింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.ర‌మ‌ణ్ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డమే కాకుండా, ఇటీవ‌లి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ ఘోర ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/