టిటిడి సభ్యునిగా సండ్ర నియామకం ఉపసంహరణ

sandra venkata veeraiah
sandra venkata veeraiah, tdp leader

తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సభ్యుడిగా ఏపి ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఐతే, టిటిడి సభ్యుడిగా నియమించి రెండు నెలలు గడుస్తున్నా ఆ బాధ్యతలను ఆయన స్వీకరించలేదు. దీంతో, టిటిడి సభ్యుడిగా సండ్ర వెంకట వీరయ్య నియామకాన్ని ఉపసంహరిస్తూ ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో సండ్ర ఒకరు. టిడిపిని వీడి టిఆర్‌ఎస్‌లోకి వెళతారన్న ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది.