తిరుమలలో నేటి నుంచి హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

తిరుమల: తిరుమలలో నేటి నుంచి ఐదు రోజుల పాటు హనుమాన్‌ జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. తిరుమల గిరుల్లోని అంజనాద్రిని హనుమంతుడిని జన్మస్థలంగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా వేడుకలను నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా బాల హనుమ, అంజనాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, ఒక్కో రోజు ఒక్కో రకం పుష్పాలతో ఆంజనేయుడికి అభిషేకం, అర్చన నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఆకాశగంగ తీర్థంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/