శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల

తిరుపతి: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆల్ లైన్ లో విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధంచిన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. రోజుకు 10 వేల చొప్పున శ్రీవారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ విడుదల చిసంది. వైకుంఠ ఏకదశి సందర్భంగా వచ్చే నెల 13 నుంచి 22 వరకురోజుకు 5 వేల టికెట్ల అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేల చొప్పున టికెట్లను ఆన్ లైన్ లో ఉంచారు.

ఇదిలా ఉంటే జనవరి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసిన రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు కేవలం గంట వ్యవధిలోనే బుక్‌ కావడం విశేషం. జనవరి నెలకు గాను మొత్తం 4.60 లక్షల టికెట్లను విడుదల చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/