శ్రీ‌వారి స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల జారీ

అర‌గంట‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు ఖాళీ

తిరుమల: తిరుమ‌ల తిరుప‌తి శ్రీ‌వారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ అన్‌లైన్‌లో విడుదల చేసింది. తొలిసారిగా ఉచిత దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. టీటీడీ ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 26 నుంచి (ఆదివారం) అక్టోబర్‌ నెల కోటా సర్వదర్శనం టోకెన్లను అందుబాటులో ఉంచనుంది. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున విడుదల చేయనున్నది.

దీంతో అక్టోబ‌రు 31 వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల జారీ ముగిసింది. 35 రోజుల టికెట్లు కేవ‌లం 30 నిమిషాల్లోనే భ‌క్తులు బుక్ చేసుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. కాగా, శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయడంతో ఇటీవ‌ల భ‌క్తులు ఆందోళ‌న‌కు దిగిన విష‌యం తెలిసిందే. దీంతో శ‌నివారం నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్లు ఇస్తామని టీటీడీ అధికారులు ముందుగానే ప్రకటించారు. ఈ నేప‌థ్యంలోనే ఈ రోజు 9 గంట‌ల‌కు టికెట్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/