టిటిడి జేఈవో శ్రీనివాసరాజు బదిలీ

Srinivasa-raju
Srinivasa-raju

అమరావతి: ఏపి ప్రభుత్వం టిటిడి జేఈవో శ్రీనివాసరాజును బదిలీ చేసింది. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరాజు స్థానంలో వీఎంఆర్‌డీఏ వైస్‌ఛైర్మన్‌గా ఉన్న బసంత్‌కుమార్‌కు టిటిడి జేఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను ప్రభుత్వం ఆదేశించింది. అయితే శ్రీనివాసరాజు ఎనిమిదేళ్ల పాటు టిటిడి జేఈవోగా పనిచేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/