కరోనాపై పోరుకు టిటిడి భారీ విరాళం

ఇప్పటికే చిత్తూరు జిల్లా అధికారులకు రూ. 8 కోట్లు అందజేత.

tirumala temple
tirumala temple

తిరుమల: కరోనాపై పోరుకు టిటిడి భారీ విరాళాన్ని ప్రకటించింది. టిటిడి తరపున ఏపి ప్రభుత్వానికి రూ, 19 కోట్లు ఇవ్వనున్నట్లు టిటిడి ఈవో అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. కాగా ఇప్పటికే చిత్తూరు జిల్లాలో కరోనా పై ఖర్చు చేయడానికి రూ. 8 కోట్లు ఇచ్చామని, మిగతా రూ. 11 కోట్లు ఏపి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. తిరుమలలో కేవలం దైవ దర్శనం మాత్రమే ఆపేశామని, స్వామి వారికి జరగాల్సిన నిత్య పూజలు అన్ని జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/