టీటీడీ పాలకమండలి పలు నిర్ణయాలు

TTD Governing
TTD Governing

తిరుమల: టీటీడి పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశం టీటీడీ పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. గరుడ వారధి రీడిజైన్‌ చేసి టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో 250 ఎకరాల్లో ఆధ్యాత్మిక సిటీ నిర్మించాలని, బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు కేటాయించారు. టీటీడీలో కూడా వంశపారంపర్య అర్చక వ్యవస్థ అమలు చేస్తామని టీటీడీ పాలకమండలి తెలిసింది. మాజీ ప్రధాన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకోమని టీటీడీ స్పష్టం చేసింది. మూడు నెలల్లో తిరుమలలో ప్లాస్టిక్ బాటిల్స్ పూర్తిగా నిషేధం విధిస్తామని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా స్విమ్స్‌ను టీటీడీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం కింద.. ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6,550 ఇవ్వాలని, 386 కాంట్రాక్టు, 246 మంది కల్యాణకట్ట ఉద్యోగులకు టైం స్కేల్, 162 మంది అటవీ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో మద్యపాన నిషేధంపై ప్రభుత్వానికి సిఫారసు టీటీడీ పంపింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/