టిటిడి ఉద్యోగుల సమస్యలకు సత్వర పరిష్కారం!

chandra babu naidu, ap cm
chandra babu naidu, ap cm


అమరావతి: ఏపి సియం, టిడిపి అధినేత చంద్రబాబును తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సియం మాట్లాడుతూ.. 24 వేల మంది టిటిడి ఉద్యోగులకు సొంత ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాది అని వారికి హామీ ఇచ్చారు. తిరుమల పరిధిలో ఏరియాల వారీగా అద్దెల నిర్ణయంపై సత్వర నిర్ణయం తీసుకుంటామని, పెండింగ్‌లో ఉన్న 84 దుకాణాల అద్దెల చెల్లింపు అంశం పరిష్కరిస్తానని తెలిపారు. 96 దుకాణాల పేరు మార్పు అంశం కూడా పరిష్కరిస్తానని తెలిపారు. అలాగే పారిశుధ్య కార్మికుల వేతనాలను పెంచుతామని స్పష్టం చేశారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos