దర్శనం టిక్కెట్లలో గందరగోళం

తిరుమలేశుని భక్తుల నిరసన గళం

  • 24కు టోకెన్లిస్తే ఎక్కడ ఉండాలంటూ ఆందోళన
  • వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు
Protest of Thirumaleshu devotees
Protest of Thirumaleshu devotees

తిరుమల: ‘ఉరుము ఉరిమి మంగలం మీద పడిందనే చందంగా ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫ్‌లైన్‌లో తిరుపతిలో జారీచేసే ఉచిత టోకెన్లు ప్రక్రియ తయారైంది. అసలే ఉచితంగా టోకన్లను జారీచేస్తున్నా దర్శన టోకెన్లు కోసం వచ్చిన భక్తులకు అవగాహన కల్పించడంలో టిటిడి సిబ్బంది లోపంతో భక్తులు అయోమయానికి గురయ్యారు.

దీంతో 24వ తేదీ దర్శనానికి టోకెన్లు కేటాయిస్తే చిన్నపిల్లలు, వృ ద్ధులతో వచ్చిన మా పరిస్థితి, సౌకర్యాలు ఎలా అని రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. మాకందరికీ 21వతేదీ దర్శనం కేటాయించాలని సుమారు 3వేలమంది వరకు భక్తులు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న తిరుపతి పోలీసులు, టిటిడి భద్రత సిబ్బంది భక్తులు చేపట్టిన ఆందోళన వద్దకు చేరుకున్నారు.

21, 22,23 తేదీలకు సంబంధించి టోకెన్లు జారీ కోటా పూర్తవడంతో 24 దర్శనానికి ఇస్తున్నామని భక్తులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఆగ్రహం తీవ్రస్థాయిలో వ్యక్తం చేశారు. ఇక చేసేది లేక పై అధికారుల నుంచి అనుమతితో ఆదివారం ఉదయం టోకన్లను పొందిన భక్తులకు సోమవారం దర్శనం కల్పించేందుకు సుముఖత చూపారు.

దీంతో భక్తులు ఆందోళన విరమించారు. అయితే ఈనెల 25,26 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు రావడంతో ఓ వైపు తిరుపతిలో వుంటున్న స్థానికులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్లు జారీచేసేందుకు టిటిడి సమాయత్తమైంది.

తిరుపతిలో ఆప్‌లైన్‌లో భక్తుల సంఖ్యను బట్టి ఈనెల 24వరకు ఈ టోకెన్లు జారీకోసం టిటిడి చర్యలు తీసుకుంది. ముందు వచ్చిన భక్తులకు ఆయా రోజుల్లో అవకాశం, ఉచిత టోకెన్లు లభ్యత బట్టి తిరుపతిలో టిటిడి సిబ్బంది కేటాయి స్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/