28న టీటీడీ బోర్డు సమావేశం

tirumala
tirumala

తిరుపతి: ఈనెల 28 న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించిన కీల‌క విష‌యాల‌పై చర్చించనున్నారు. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్న విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధనల నేపధద్యంలో… ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు, ఊరేగింపులకు అనుమతి లేకపోవడంతో కేంద్ర మార్గదర్శకాల కోసం టీటీడీ ఎదురు చూస్తోంది.

బ్రహ్మోత్సవ రోజుల్లో రూ. 300 టికెట్లను ఇప్పటికే రద్దు చేశారు. లాక్ డౌన్ నిబంధనల నుంచి ఊరేగింపులకు మినహాయింపు దక్కనిపక్షంలో… బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగానే నిర్వహిస్తామ‌ని టీటీడీ అధికారులు చెబుతున్నారు. మొత్తంమీద కరోనా మహమ్మరి నేపధ్యంలో జరగనున్న ఈ ఉత్సవాలను ఈ దఫా సాదాసీదాగానే నిర్వహించనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/