టీటీడీ పాలకమండలి భేటి.. కీలక నిర్ణయాలు

వార్షిక రివైజ్డ్ బడ్జెట్ కు ఆమోదం

tirumala temple
tirumala temple

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది.టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రమణదీక్షితులును గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించారు. దాంతోపాటే, 201920 టీటీడీ బడ్జెట్ ను కూడా ప్రకటించారు. రూ.3243 కోట్ల వార్షిక రివైజ్డ్ బడ్జెట్ కు పాలకమండలి ఆమోదం తెలిపింది. రూ.8 కోట్లతో రెండు ఘాట్ రోడ్డుల మరమ్మతులకు అనుమతులు లభించాయి. జమ్మూకశ్మీర్, వారణాసిలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. రూ.30 కోట్లతో ముంబయిలో శ్రీవారి ఆలయం నిర్మించాలని తీర్మానించారు. ముఖ్యంగా, సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటుకు కూడా టీటీడీ బోర్డు పచ్చజెండా ఊపింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/