15 నెలలుగా బొత్స కరెంట్ బిల్ కట్టలేదట..అందుకే కరెంట్ కట్ చేశారట

శుక్రవారం కేటీఆర్ ఏపీ లోని కరెంట్ కోతలు , రోడ్ల పరిస్థితి , నీళ్ల సరఫరా ఫై చేసిన కామెంట్స్ కు వైసీపీ నేతల నుండి వరుస కౌంటర్లు పడుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కావాలని చేసింది కాదని కేటీఆర్ చెప్పినప్పటికీ..వైసీపీ నేతలు మాత్రం కామెంట్స్ కురిపిస్తూనే ఉన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ..హైదరాబాద్‌లో తాను ఉండి వచ్చానని అక్కడ కరెంట్‌ లేదని… జనరేటర్ వేసుకుని వచ్చానని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల సందర్భంగా టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ స్పందించింది. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీరు కరెంట్ బిల్ క్లియర్ చేసిన వెంటనే మీ ఇంటికి విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పింది. 15 నెలలుగా కరెంట్ బిల్ కట్టలేదని విద్యుత్ శాఖ బొత్సకు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసింది. మరి దీనిపై బొత్స ఏమని స్పందిస్తారో చూడాలి.

అసలు కేటీఆర్ ఏమన్నారంటే.. నిన్న శుక్రవారం హెచ్ఐసీసీలో జరిగిన ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ఏపీలో పరిస్థితులపై కేటీఆర్ కామెంట్స్ చేసారు. ఏపీలో క‌రెంట్ లేదని.. నీళ్ళు లేవని.. రోడ్లు ధ్వంసం అయ్యాయన్నారు.అక్కడి పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. తన మిత్రుడు ఊరినుంచి తిరిగి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్న‌ట్లు ఉందని చెప్పాడన్నారు. ఈ కామెంట్స్ ఫై వైసీపీ నేతలు వరుసపెట్టి కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు.