కార్మికులను ఎందుకు అనుమతించడం లేదు

డిమాండ్‌ చేసి ఆర్టీసి జేఏసి

ashwathama reddy
ashwathama reddy

హైదరాబాద్‌: ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరతారని ఆర్టీసి జేఏసి ప్రకటించింది. కాగా నేడు విధుల్లో చేరేందుకు డిపోలకు చేరుకుంటున్న కార్మికులను పోలీసులు అడ్డగించి, అరెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ఆర్టీసి జేఏసి కార్మికులు విధుల్లోకి అనుమతించకపోవడాన్ని ఖండిస్తున్నామని తెలిపింది. కార్మికులను ఎందుకు అనుమతించడం లేదు, దానికి సంబంధించిన వివరణ రాతపూర్వకంగా డిఎంలు తెలపాలని జేఏసి డిమాండ్‌ చేస్తుంది. ఆర్టీసి సమ్మె విరుద్ధమని హైకోర్టు తెలుపలేదని, ఎండిల అనుమతితో సమ్మెలోకి పోవడంకాని, విరమించడం కాని జరగదని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ చర్యను మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరింది. ప్రభుత్వం కార్మికులను అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నదని ఆర్టీసి జేఏసి మండిపడింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/