కార్మికుల శ్రేయస్సుకోసం సమ్మె విరమణ

ashwathama reddy
ashwathama reddy

హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసి కార్మికులు చేపట్టిన సమ్మెను కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా విరమిస్తున్నట్లు ఆర్టీసి జేఏసి ప్రకటించింది. రేపటినుంచి కార్మికులందరూ విధులకు హాజరుకావాలని ఆర్టీసి జేఏసి కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. ఈ విషయమై మీడియాతో మాట్టాడిన జేఏసి నేతలు.. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆర్టీసి యాజమాన్యం కనీసం స్పందిచలేదని అన్నారు. ప్రభుత్వం కూడా ఏమి పట్టనట్లు వ్యవహరించిన తీరును విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని విధాలుగా కార్మికులను భయపెట్టినా నిరసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా అందరూ తప్పనిసరిగా విధుల్లో చేరాలని అశ్వత్థామరెడ్డి కోరారు. అన్ని షిఫ్ట్‌ల కార్మికులు విధులకు హాజరుకావాలన్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపటినుంచి విధులకు హాజరు కావొద్దని విజ్ఞప్తి చేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/