ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు

సమ్మె యథాతథo

Ashwathama Reddy
Ashwathama Reddy

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమించి నేటి అర్ధ రాత్రి లోగా విధుల్లో చేరితే సరేసరని, లేదంటే ఉద్యోగాలపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న తెలంగాణ సిఎం కెసిఆర్‌ వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పందించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇలాంటి ముఖ్యమంత్రులను చాలామందిని చూశామన్నారు. కోర్టులనే ధిక్కరించిన ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. రెవెన్యూ అధికారులను విలన్లుగా చిత్రీకరించిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్న అశ్వత్థామరెడ్డి.. తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు కేసీఆర్ వ్యాఖ్యలే కారణమని ఆరోపించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/