రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి కార్మికులు ఆందోళనలు

52వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

TSRTC Strike
TSRTC Strike

హైదరాబాద్: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ తెలగాంణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 52వ రోజుకు చేరింది. సేవ్‌ ఆర్టీసీ పేరుతో ఇవాళ డిపోల ఎదుట కార్మికుల నిరసనలు చేపట్టనున్నారు. సమ్మెపై హైకోర్టు ఎటూ తేల్చక.. ప్రభుత్వం ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికులు త్రిశంకు స్వర్గంలో పడినట్లైంది. విధుల్లో చేరతామన్నా ప్రభుత్వం అంగీకరించలేదు. దీనిపై లేబర్ కోర్టుకు వెళ్లడంపై కూడా అస్పష్టత నెలకొంది. సిఎం కెసిఆర్‌ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా.. అని కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఇక తమ భవిష్యత్తు కార్యాచరణపై ఇవాళ ఆర్టీసీ జేఏసీ సమావేశం కానుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/