అదుబాటులోకి వచ్చిన 40 ఎలక్ట్రిక్‌ బస్సులు

 Electric Buses
Electric Buses

హైదరాబాద్‌: నగరంలోకి ఎలక్ట్రిక్ బస్సులు ఈ రోజు నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.నగరంలోని రెండు మార్గాల మీదుగా 40 బస్సులను శంషాబాద్ విమానాశ్రయానికి నడుపనున్నారు. ఏసీ, వైఫై, రేడియో సిస్టం సహా అనేక అత్యాధునిక సదుపాయాలు ఈ బస్సుల్లో అందుబాటులో ఉన్నాయి. కంటోన్మెంట్, మియాపూర్ డిపోల నుంచి ఈ సర్వీసులు నడుపాలని నిర్ణయించారు. కంటోన్మెంట్ డిపోకు చెందిన బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్ (జేబీఎస్) నుంచి బయలు దేరుతాయి. జేబీఎస్ నుంచి విమానాశ్రయం వరకు రూ. 265 చార్జీ వసూలు చేస్తారు. మియాపూర్ డిపోకు చెందిన బస్సులు బీహెచ్‌ఈఎల్, మియాపూర్ నుంచి బయలు దేరుతాయి. మియాపూర్ నుంచి విమానాశ్రయానికి రూ. 280 చార్జీ ఉంటుంది.
చార్జీలు ఇలా..
ఉప్పల్ మార్గంలో

• జేబీఎస్, సంగీత్, తార్నాక తదితర బస్‌స్టాప్‌ల నుంచి విమానాశ్రయానికి రూ. 265.
• ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్ నుంచి రూ. 210.
•చాంద్రాయణగుట్ట నుంచి రూ. 160
• పహాడీషరీఫ్ నుంచి రూ. 105

ఆరాంఘర్ మార్గంలో

• జేబీఎస్, సంగీత్, సెక్రటేరియట్‌ల నుంచి విమానాశ్రయానికి రూ. 265
• ఏసీ గార్డ్స్, ఎన్‌ఎండీసీ నుంచి రూ. 210
• ఆరాంఘర్ నుంచి రూ. 160
•శంషాబాద్ నుంచి ఎయిర్‌పోర్టుకు రూ. 105

బీహెచ్‌ఈఎల్ రోడ్డులో..

• బీహెచ్‌ఈఎల్, లింగంపల్లి నుంచి విమానాశ్రయానికి రూ. 265
• ఆల్విన్ క్రాస్‌రోడ్స్, శిల్పారామం, గచ్చిబౌలీ నుంచి రూ. 210

మియాపూర్ మీదుగా..

• మియాపూర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు రూ. 280
• జేఎన్‌టీయూ నుంచి విమానాశ్రయానికి రూ. 265
•శిల్పారామం, గచ్చిబౌలీ నుంచి విమానాశ్రయానికి రూ. 210