లాభాల్లో TSRTC ..కరోనా ప్రభావం మొదలయ్యాక ఇదే అత్యధికం

మొన్నటి వరకు టీఎస్ ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుందని అంత మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం టీఎస్ ఆర్టీసీ లాభంలోకి వెళ్లిందని మాట్లాడుకుంటున్నారు. ఇదంతా కూడా కొత్తగా ఎండీ గా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్ వల్లే అని చెపుతున్నారు. ఎండీ గా బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుండి సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులను ఆకర్షిస్తూ వస్తున్నారు సజ్జనార్ . దీంతో గతంలో అబ్బా ఆర్టీసీ బస్సా..అని అనుకున్న వారంతా ఇప్పుడు ఏ ఆర్టీసీ బస్ ఎక్కాల్సిందే అని పరుగులు పెడుతున్నారు.

ఇక సోమవారం టీఎస్ ఆర్టీసీ రికార్డు స్థాయి ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసుకోవడం విశేషం. సోమవారం 77 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదు చేసుకుందని, కరోనా ప్రభావం మొదలయ్యాక ఇదే అత్యధికం అని చెపుతున్నారు. సాధారణంగా సోమవారాల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రోజుతో పోలిస్తే కొంత ఆదాయం ఎక్కువగానే వస్తుంది. కానీ మొన్నటి సోమవారం మాత్రం రూ.14.07 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. 10 రీజియన్లలో లక్ష్యానికి మించి ఆదాయం వచ్చినట్లుగా తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.75.52 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లో కలిపి 85.84 శాతం నమోదైంది. ఈ లెక్కలు చూసి అధికారులు , కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ ఇంకాస్త కష్టపడి మరింత లాభాన్ని అందజేస్తామని చెపుతున్నారు.