ఆగని ఆర్టీసి ఆందోళనలు

TSRTC Strike
TSRTC Strike

హైదరాబాద్‌: ఆర్టీసి కార్మికులకు ప్రభుత్వం విదించిన గడువు ముగిసినప్పటికీ కార్మికులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. తెల్లవారుజామునుండే డిపోల ముందు నిరసనలు కొనసాగిస్తున్నారు. సూర్యాపేట డిపో ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులకు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడ డిపో ఎదుట నిరసన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగర్‌ కర్నూల్‌, మంచిర్యాల ఆర్టీసి డిపోల ఎదుట కార్మికులు నిరసన బాట పట్టారు. ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. జగిత్యాల డిపో ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, ఇవాళ ఉదయం నుంచి కార్మికులు నిరసన చేపట్టారు. బస్సులను వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా వారికి మద్దతుగా స్థానిక టిడిపి, టిజెఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/