నగరంలో మరో 10 డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు TSRTC ఏర్పట్లు

హైదరాబాద్ మహానగరంలో డబుల్ డెక్కర్ బస్సు లో ప్రయాణం చేయాలనే నగరవాసుల కోరిక తీరిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా హైదరాబాద్ లో మూడు డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించడం జరిగింది. ఇక ఇప్పుడు మరో 10 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు TSRTC ఏర్పాట్లు చేస్తుంది. నిజాం కాలం‌లో ప్రారంభ‌మైన డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు కాల‌క్ర‌మేణా క‌నుమరుగై పోయాయి. సికింద్రాబాద్ నుంచి జూపార్క్ మార్గంలో 7 నంబ‌ర్‌తో న‌డిచేవి ఈ బస్సులు నడిచేవి.

జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జ‌ల్‌గంజ్‌, అబిడ్స్‌, హుస్సేన్ సాగ‌ర్‌, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకునేవి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వరకు నగర రోడ్లపై పరుగులు పెట్టిన ఈ బస్సులు ఆ తర్వాత ఒక్కొక్కటిగా మాయమయ్యాయి. నిర్వహణ భారం కారణంగా ఆర్టీసీ వీటిని ఒక్కొక్కటిగా సర్వీసు నుంచి తప్పించింది. దీంతో డబుల్ డెక్కర్ బస్సులు చరిత్ర పుటల్లోకి చేరాయి. మళ్లీ ఇన్నాళ్లకు వీటిని తిరిగి హైద్రాబాద్ రోడ్ల ఫై పరుగులు పెట్టించింది టీఎస్ ఆర్టీసీ.

గతంలో మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన మాట మేరకు.. నగరానికి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు మరో 10 డబుల్ డెక్కర్ బస్సులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ బస్సులను ఏ మార్గంలో నడిపించాలన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అందుతోన్న సమాచారం ప్రకారం. డబుల్‌ డెక్కర్‌ బస్సులను మెట్రో మార్గం, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలు లేని మార్గాల్లో నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.