TSRTC కీలక నిర్ణయం : ఇకపై ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ బస్‌పాస్‌లు

ప్రయాణికుల కోసం నిత్యం ఏదోక తీపి కబురు తెలుపుతూ వస్తున్న TSRTC ..తాజాగా మరో గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికులు నిత్యం ఏదోక పని మీదగాని , ఉద్యోగ రీత్యా ప్రతి రోజు ప్రయాణాలు చేస్తుంటారు. ఆలా చేసేవారి కోసం ఎక్స్‌ప్రెస్‌ బస్ పాస్ సౌకర్యం అందించబోతుంది. ఎక్స్‌ప్రెస్‌ బస్ సర్వీసుల్లో కిలోమీటర్‌ ఆధారంగా నెలవారీ బస్‌పాస్‌లు మంజూరు చేయాలని TSRTC నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్‌ విధానాన్ని ఎత్తివేసిన టిఎస్ఆర్టీసీ… కిలోమీటర్ ఆధారంగా రుసుం వసూలు చేసేందుకు డిసైడ్ అయ్యింది. అంతేకాకుండా టోల్‌ ప్లాజ్‌ రుసుం కూడా బస్‌పాస్‌తో పాటే వసూలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ నెలవారీ బస్‌పాస్‌ల విషయానికొస్తే.. గతంలో ఇందులో శ్లాబ్‌ విధానం అమల్లో ఉండేది. కానీ ఇకమీదట శ్లాబ్ విధానంలో కాకుండా గమ్యస్థానం ఎన్ని కిలోమీటర్లు ఉంటే.. అన్ని కిలోమీటర్లకే బస్‌పాస్‌ను ఇచ్చే యోచనలో ఉంది. టిఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా నెలవారీ బస్‌ పాస్ దారులకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూర్చుతుంది” అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అభిప్రాయపడ్డారు. ఈ సదుపాయాన్ని రెగ్యులర్‌‌‌గా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే వారు సద్వినియోగం చేసుకోవాలని వీసీ సజ్జనార్ సూచించారు.