ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మ‌రో కీల‌క నిర్ణ‌యం

పిల్లలకు పాలిచ్చేందుకు బస్టాండ్లలో కేంద్రాల ఏర్పాటు

హైదరాబాద్: సమర్థవంతమైన పోలీసు అధికారిగా సజ్జనార్ కు ఎంతో పేరుంది. ప్రస్తుతం ఆయనతెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఎండీగా బాధ్యతలను నిర్వహిస్తున్నప్పటి నుంచి సజ్జనార్ పలు వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలింతలు బస్టాండ్ లలో పసిపిల్లలకు పాలిచ్చేందుకు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. వారి ఇబ్బందికి ముగింపు పలికేందుకు సజ్జనార్ నిర్ణయించారు. బాలింతలు పాలిచ్చేందుకు బస్టాండ్లలో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాలను తొలుత హైదరాబాదులోని ఎంజీబీఎస్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ లలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/