విపక్ష నేతలతో ఆర్టీసీ జేఏసీ భేటీ

ashwathama reddy
ashwathama reddy

హైదరాబాద్‌: ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యలయంలో విపక్ష నేతలతో కలిసి ఐకాస నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి విపక్ష నేతలు భట్టి విక్రమార్క, సంపత్‌కుమార్‌, కోదండరామ్‌, వి.హనుమంతరావు, చాడ వెంకట్‌రెడ్డి, విమలక్క హజరయ్యారు. ఈ సమావేశంలో ట్యాంక్‌బండ్‌ పరిణామాలు, భవిష్యత్‌ కార్యచరణ, విపక్షాల మద్దతు కోరటం, రేపు హైకోర్టులో వాదనలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…సోమవారం వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల ముందు నిరసన ప్రదర్శనలు చేస్తామని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. ట్యాంక్‌బండ్‌పై శనివారం జరిపిన నిరసనలో మావోయిస్టులు ఎవరూ లేరని అన్నారు. హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియకుండానే…సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని సీఎం అనడం ఎంతమాత్రం సమంజసం కాదని అశ్వత్థామరెడ్డి అన్నారు.
తాజా అంతార్జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/