మల్లన్న భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

TSRTC is good news for Mallanna devotees

Community-verified icon


కార్తీక మాసం వేళ టీఎస్ఆర్టీసీ ఆర్టీసీ మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది. పండగళ వేళ ప్రయాణికులకు తీపి కబురు అందించే TSRTC కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం వెళ్లి ప్రయాణికులకు , భక్తులకు గుడ్ న్యూస్ అందించింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్టు తెలిపింది. శ్రీశైలానికి రాత్రి పూట కూడా ప్రత్యేక బస్సులు నడుపుతామని టీఎస్‌ఆర్‌టీసీ తెలిపింది. ఈ ప్రత్యేక సేవలతో.. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆలయానికి చేరుకోవచ్చు అని తెలిపింది. హైదరాబాద్ నుండి శ్రీశైలం ఆలయానికి ఉదయం 3:45 నుండి 11:45 గంటల మధ్య టీఎస్‌ ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది.

మరోపక్క ఇప్పటికే కార్తీక మాసం సందర్బంగా భక్తులకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తక్కువ ఛార్జీతో 5 ప్రముఖ ఆలయాల సందర్శనకు కార్తీకమాస దర్శిని ప్యాకేజీ-2 పేరుతో ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్‌ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ఉదయం 7గంటలకు సికింద్రాబాద్‌ గురుద్వార వద్ద బస్సులు ప్రారంభమై అలియాబాద్‌ (రత్నాలయం), వర్గల్‌ (మహసరస్వతి), కోమర వెల్లి (మల్లన్నస్వామి), కీసరగుట్ట (రామలింగేశ్వర స్వామి),చీర్యాల (లక్ష్మి నర్సింహ స్వామి) ఆలయాల దర్శనం అనంతరం తిరిగి గురుద్వార వద్దకు బస్సుుల చేరుకుంటాయని సికింద్రాబాద్ డీవీఎం అపర్ణకల్యాణి తెలిపారు. టికెట్ చార్జీలు పెద్దలకు రూ. 500, పిల్లలకు రూ.300 ఉంటుందని అన్నారు. ఆలయాల్లో దర్శనం, భోజన ఖర్చులు ప్రయాణీకులే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.