తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు తెలిపిన ఆర్టీసీ

TSRTC- MD-Sajjanar‌s-take-key-decisions-for-women

ఆర్టీసీ ఎండీ గా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్..ఆర్టీసీ ని లాభాల్లోకి తేవడమే కాదు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వరుస శుభవార్తలు ప్రకటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మూడేళ్ల విరామం తర్వాత 5 శాతం కరువు భత్యం(డీఏ) పెంచుతున్నట్లు ప్రకటించి వారిలో ఆనందం నింపారు. తాజాగా నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తెలంగాణ నిరుద్యోగ యువతకు బస్సులపై ఆర్టీసీ డిస్కౌంట్ ను ప్రకటించింది.

నిరుద్యోగ యువతకు చేయూత అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సిటీ ఆర్డినరీ అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ ల పై 20% డిస్కౌంట్ అందించనున్నట్లుగా స్పష్టం చేసింది. ఈ రెండు రకాల బస్సు పాసులు నగరంలోని అన్ని బస్ పాస్ కౌంటర్లలో పొందవచ్చునని ..బస్ పాస్ పొందడానికి దరఖాస్తుకు సంతకం చేసిన ఆధార్ కార్డు తో పాటుగా కోచింగ్ సెంటర్ ఐడీ కార్డు జిరాక్స్ జత చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్డినరీ బస్సు పాస్ మూడు నెలలకు 20 శాతం డిస్కౌంట్ తో ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది.