ఉచిత సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణకు దరఖాస్తులు

ts sc study circle civil services
ts sc study circle civil services

హైదరాబాద్‌: 2019-20 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యూపీఎస్‌సీ-సీ శాట్‌ (సివిల్‌ సర్వీసెస్‌) ఉచిత శిక్షణకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీఎస్ ఎస్‌సీ స్టడీ సర్కిల్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.బాలసురేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఆసక్తిగల వారు ఈనెల 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో www. tsstudycircle.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా జనరల్ లేదా ప్రొఫెషనల్ కోర్సులలో డిగ్రీ పూర్తి చేసిన 250మంది ఉమ్మడి జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన స్త్రీ, పురుషు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 


మరిన్ని కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/