విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్ ఆర్టీసీ

టిఆర్ఎస్ ఆర్టీసీ ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్ అందజేస్తూ వస్తుంది. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి సజ్జనార్ సరికొత్త ఆలోచనలతో ప్రయాణికుల్లో ఆనందం నింపుతున్నారు. ప్రవైట్ ట్రావెల్స్ కు ఏమాత్రం తగ్గకుండా పండగల వేళా ఆఫర్లు ప్రకటిస్తూ..నిత్యం ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లు బస్సులను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. అలాగే ఆర్టీసీకి ఆదాయం సమకూర్చడంలోను విజయం సాధిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో తీపి కబుర్లు తెలిపిన ఈయన..తాజాగా విద్యార్థులకు గుడ్‌న్యూస్ అందజేశారు. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ విద్యార్థుల గ్రేటర్‌ హైదరాబాద్‌ బస్‌పాస్‌లను పరిమితి వరకు అనుమతించాలని ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయించారు.

ప్రస్తుతం సిటీ బస్సుల్లోనే వారి పాసులు చెల్లుబాటు అవుతున్నాయి. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో విద్యార్థుల సాధారణ బస్సు పాసులను అనుమతించటం లేదు. నగర శివారులో సిటీ బస్సులు తక్కువగా తిరిగుతున్నందున వీరు ప్రైవేటు వెహికల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఆర్టీసీ సిటీ బస్‌పాస్‌ ఉన్న విద్యార్థులను పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులోనూ ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రకటన తో స్టూడెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.