ఈరోజు నుండి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

TS Polycet
TS Polycet

హైదరాబాద్‌: తెలంగాణ 2019 విద్యా సంవత్సరం డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ఈరోజు నుండి ప్రారభమంది. అయితే 2019 పాలిసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఈరోజు నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తమ ప్రాథమిక సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ చేయనున్నారు. 15 నుంచి 19వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో ఆప్షన్స్‌ను ఎంచుకోవచ్చు. 22న సీట్ల కేటాయింపు, 23 నుంచి 25వ తేదీల వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లింపు, జూన్‌ 1 న సంబంధిత కళాశాలలో చేరాల్సి ఉంటుంది. కాగా అన్ని జిల్లాలో జిల్లాకు ఒకటి చొప్పున సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సహాయ కేంద్రాలు పనిచేయనున్నాయి.


మరిన్ని కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/